అర్ణబ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసింది. ఇలాంటి కష్ట సమయంలో ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. విద్యార్థులు తమ తమ ప్రాంతాల్లో విరాళాలు పోగుచేసి బాధితులకు పంపుతున్నారు. ఉద్యోగులు తమ ఆఫీసుల్లో విరాళాలు సేకరించి సీఎం సహాయ నిధికి పంపుతున్నారు.
అర్ణబ్ తుఫాన్ బాధితుల కోసం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ఉద్యోగులు మానవీయ పనిని చేసారు. ఉద్యోగులందరు తమ ఒకరోజు జీతాన్ని రూ. 5.01 కోట్లు అర్ణబ్ తుఫాను బాధితుల సహాయార్ధం సీఎం సహాయ నిధికి అందించారు, వారి బాటలోనే మరికొన్ని బ్యాంకులు కూడా నడుస్తున్నాయి.
