తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదని ఇందిరమ్మ ఇల్లు పధకం క్రింద 40 వేల కోట్లు వెచ్చిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మొదటి విడతగా 4.50 లక్షల గృహాలు మంజూరు చేసారు. రెండో విడతలో 2.50 లక్షల గృహాలు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ పరిధిలో 1లక్ష ఇళ్లతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
పేదల కోసం ఏ పార్టీ చేయనివిధంగా వేల కోట్ల రూపాయలు హౌసింగ్ కోసం ఖర్చుపెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే నిరుపేదలకు 500000 రూపాయల ఆర్ధిక సహాయం ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ లోనే అందించడం జరిగిందిన్నారు. 5 లక్షల ఆర్ధిక సహాయం తో పాటు, డ్వాక్రా రుణాలు, బిల్డింగ్ కు అవసరమైన సామాగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి అతి తగ్గకువధరలకు అందిస్తోంది అని పొంగులేటి తెలిపారు.
