ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను లోబరుచుకొనేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికైనా వెనుకాడట్లేదు, కానీ వారి ఇష్టారాజ్యంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి నిబంధనలు ఒప్పుకోవు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ మేయర్, కార్పొరేటర్ ఎంత లోపు ఖర్చు చేయాలనే నిబంధనలు చూద్దాం.
మేయర్ అభ్యర్థి : 25 లక్షల లోపు
కార్పొరేటర్ అభ్యర్థి : 10 లక్షల లోపు
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నిర్ణయించిన మొత్తాన్ని ప్రచారంలో ఉపయోగించే వాహనాలు, మైకులు, ప్రచార సామాగ్రి కి సంబంధిచి ఏ సామాగ్రికి నిర్దేశిత రేట్ల ప్రకారం లెక్కించి వారు అధికారాలకు లెక్కలు చూపాలి. అధికారులు కూడా ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తుంటారు, వాటిలో వారు వాడుతున్న సామాగ్రిని నోట్ చేసుకొని అభ్యర్థులు సమర్పించే వాటితో సరి చూసుకుంటారు. ఒకవేళ అభ్యర్థులు నిర్ణయించిన మొత్తానికి మించి ఖర్చు పెడితే వారి అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తారు.
