అర్ణబ్ తుఫాన్ వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది, రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. అధికారాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట తీవ్రతను అంచనావేస్తున్నారు. రోడ్లు, కరెంటు లైన్లు రిపేర్ చేసి బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ తీవ్రత వల్ల కొన్ని ప్రాంతాల్లో కరెంటు లేకుండా చీకట్లోనే ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. తుఫాన్ ధాటి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మురుసు తుఫాన్ తో మరో ముప్పు పొంచి ఉంది.
మురుసు తుఫాన్ అర్ణబ్ అంత ప్రభావ వంతంగా ఉండదని అంచనా వేస్తున్నారు, మచిలీపట్టణం, నెల్లూరు తీర ప్రాంతాల్లో ప్రాభవం ఉండవచ్చని భావిస్తున్నారు, ఈ సంవత్సరంలో వచ్చిన రెండొవ తుఫాన్ ఇది. మురుసు తుఫాన్ వల్ల ఎలక్షన్ కౌంటింగ్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
