వాతావరణ వివరాల ప్రకారం అర్ణబ్ తుఫాను గంటకు 17 కిలో మీటర్ల వేగంతో తీరం వైపు దూసుకువస్తుందని అంటున్నారు. సోమవారం సాయంత్రం అర్ణబ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా ఏర్పడింది. ఉదయం 13 కిలో మీటర్ల వేగంతో సాయంతం 17 కిలోమీటర్ల వేగంతో ఏపీ వైపు దూసుకు వస్తోంది. అర్ణబ్ తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, మత్యకారులు వేటకు వెళ్ళద్దని, తీర ప్రాంతంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.
తుఫాన్ దృశ్య ప్రభుత్వం గవర్నమెంట్ అధికారుల సెలవలు రద్దు చేసి అందరు విధుల్లో ఉండాలని ఆదేశించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ షాప్స్ లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచింది, ముందు జాగ్రత్తగా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు, ఏపీ లోకి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ సహాయం కోసం టోల్ ఫ్రీ సెంటర్స్ ఏర్పాటు చేసారు. అత్యవసర సమయంలో ప్రజల కొరకు ఆహరం, త్రాగునీరు, చిన్న పిల్లలకు పాలు వంటి సౌకర్యాలను సిద్ధం చేయాలనీ చంద్రబాబు బాబు ఆదేశించారు. మంత్రులు, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తుఫాన్ ప్రభివిత ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
