నామినేషన్ తోనే ఒణుకు పుట్టుస్తున్న ఒంగోలు ఎలక్షన్స్ | జనసునామి | netivartha.com
ఆంధ్ర రాష్ట్రం లో మున్సిపల్ ఎన్నికలు కోలాహలం మొదలయ్యింది, నామినేషన్ వేసి అభ్యర్థులు నేరుగా ప్రచారం మొదలుపెడుతున్నారు, ఈ నేపథ్యంలోనే కూటమి ఒంగోలు మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లమల్లి శ్రీ శిల్ప నేరుగా ప్రచారం చేసారు.
నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ఒంగోలు కోర్ట్ సెంటర్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రజలు తండోప తండాలు గా పాల్గొన్నారు, ప్రజలతో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్, ఓయూడీఏ చైర్మన్ షేక్ రియాజ్ గారికి, మాజీ మేయర్ గంగాడ సుజాత, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ సెగ్గం శ్రీనివాసులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల తో ఒంగోలు కోలాహలంగా మారిపోయింది.

