ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకం ... గౌతమీ శ్వేత కృషికి పురస్కారం
కూటమి ప్రభుత్వంలో మహిళల సంక్షేమం, మహిళా హక్కుల రక్షణ మరియు సాధికారతకు గౌతమీ శ్వేత ఎంతో కృషి చేసారని, ఆ కారణం చేత ఏపీ ప్రభుత్వం ఆమె సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌతమీ శ్వేతను ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించారు.
గౌతమీ శ్వేత మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, గృహహింస వివక్ష వంటి సమస్యలు నానాటికి ఎక్కువ అవుతున్నాయని వాటిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం తన భాధ్యత అని తెలిపారు. ఈ సదవకాసాన్ని తనకు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

