కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు | పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు | Netivartha.com
అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజును అత్యంత పవ్త్రిమంగా భావిస్తారు భక్తులు, ఈ రోజున అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది.
దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు, అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని, తెలిపారు.

