మిధున్ రెడ్డిపై దాడి ... వైసీపీ నేతల ఆగ్రహ జవాలాలు | జగన్ ఘాటు స్పందన | AP Politics | YCP | TDP | Netivartha.com
ఎంపీ మిధున్ రెడ్డిపై దాడి ఘటన స్థానిక ఎన్నికల నేపథ్యంలో పెనుదుమారం రేపుతోంది, ఘటనపై వైఎస్సాఆర్ సీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకర పరిస్థితులపై విచారం వ్యక్తం చేసారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు చూస్తుంటే జరగబోవు ఎన్నికలు సజావుగా జరుగుతాయని తమకు నమ్మకం లేదని తెలిపారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణ రాజు మాట్లాడుతూ దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎన్నికల్లో పోటీ చేసేవారికి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు.
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుండా సురేంద్ర దాడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మిదున్ రెడ్డి పై దాడి, వాహనాలు ధ్వంసం వంటి కవ్వింపు చర్యలు రాజకీయాల్లో సరికాదని హితవు పలికారు.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి దాడులు అమానుషమని, ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారని జరిపి దోషులను శిక్షించేలా చూడాలి అని పేర్కొన్నారు.
అవినాష్ రెడ్డి, ఎంపీ, కడప మాట్లాడుతూ ఓటమి భయంతోనే ఇటువంటి దాడులు మన రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్నాయని వాటిని సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేసి బాధితులకు రక్షణ కల్పించాలన్నారు.
ఆర్ కే రోజా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా, శాంతిభద్రతలు జాడలేకుండా పోయాయని తీవ్రంగా ఆక్షేపించారు.

