రేషన్ కార్డు లో అడ్రస్ మీకు తలనొప్పి తెచ్చిపెట్టనుందా | రేషన్ కార్డు లో అడ్రస్ తప్పుగా ఉంటే ఏం నష్టపోబోతారో తెలుసా? ఆన్లైన్ లో రేషన్ కార్డు అడ్రస్ మార్చడం ఎలా | Ration Card | Netivartha.com
కూటమి ప్రభుత్వం హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉన్న లోపల వల్ల దీనిని త్వరలో పూర్తిగా రద్దుచేయనుందని అసెంబ్లీ లో తెలిపారు, కానీ అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు, త్వరలో హౌస్ హోల్డ్ మాపింగ్ రద్దు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటివరకు ఏ పధకానికైనా హౌస్ హోల్డ్ మాపింగ్ ఆధారంగా స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వ పధకాలను అందిస్తున్నారు. హౌస్ హోల్డ్ మాపింగ్ రద్దు జరుగుతున్నా సందర్భంలో ఇకనుండి ఆధార్ అడ్రస్ మరియు రేషన్ కార్డు అడ్రస్ ను స్థానికతగా తీసుకోనున్నారు, అందువలన ప్రజలు వారి ఆధార్ అడ్రస్ మరియు రేషన్ కార్డు అడ్రస్ మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
రేషన్ కార్డు లోని అడ్రస్ ను మార్చుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్ ఇలా చేయాలి:
ఈ లింక్ ను ఓపెన్ చేయండి: https://apseva.ap.gov.in/#/home

లాగిన్ మీదకు మౌస్ తీసుకు వెళ్ళగానే Citizen Login, Employee Login అని అడుగుతుంది, అప్పుడు Citizen Login సెలెక్ట్ చేసుకోండి.

ఇప్పుడు ఇమేజ్ లో చూపించిన విధంగా Sign up with Google సెలెక్ట్ చేసుకుంటే మీ Email తో వెబ్సైటు లోకి లాగిన్ అవ్వచ్చు. వెబ్సైటు ఓపెన్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది.
ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్న Consumer Affairs, Food and Civil Supplies క్లిక్ చేయండి, ఇపుడు 7th నెంబర్ లో ఉన్న Change of Details in Rice Card క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ అయింది, అప్లికేషన్ ఫిల్ చేయండి



