ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక ఎన్నికలు ఆరోపణలు, ప్రత్యారోపణలు మీద జరుగుతున్నాయి, ప్రతి పార్టీ ప్రత్యర్థులను దూషిస్తూ రాజకీయాలు చేస్తోంది, రాష్ట్రంలో జరుగుతున్న హింసాఖండ సుప్రీం కోర్ట్ జ్యోక్యం చేసుకొని ఎలక్షన్ కమిషన్ కు కొన్ని సూచనలు చేసిన తరువాత ఎలక్షన్ తేదీలు వంటి చాలా మార్పులు జరుగుతున్నాయి.
సుప్రీమ్ కోర్ట్ కి వెళ్లి మరి స్థానిక ఎన్నికల్లో వైకాపా కొన్ని మార్పులు చేసేలా చేసింది. వైకాపా ప్రత్యర్థి పార్టీపై చేస్తున్న ఆరోపణలు ఇవే.
* అభ్యర్థులు నామినేషన్ వేయకముందే బెదిరింపులకు దిగుతున్నారు.
* పార్టీ కార్యకర్తలను బెదిరించి ముందుస్తు అరెస్టులు చేయడం.
* మాజీమంత్రి విడదల రజినిని గృహనిర్బంధం లో ఉంచి ఎన్నికల్లో పాల్గొనకుండా చేసినట్లు ఇతర నాయకులను చేయడం.
* నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థులు రాకుండా మనుషులతో కాపలా కాయించడం.
* నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికారాలు, పోలీసుల ముందే లాక్కోవడం, అలాంటి ఘటనలు సోషల్ మీడియా లో కూడా చాలా వచ్చాయి.
* నామినేషన్ పత్రాలు లాక్కొన్న వీడియోలు ఎన్ని వచ్చిన ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు, ఇదే విషయాన్నీ సుప్రీం కోర్ట్ అడిగినప్పుడు సమాధానం రాలేదు.
* దాడికి గురైన వారు ఇంటినుండి బయటకు కూడా రానివ్వకుండా చేయడం వంటి చాలా ఆరోపణలు ఉన్నాయి.
* స్క్రూటినీ పేరుతో అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
* అభ్యర్థుల ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ
* నకిలీ నామినేషన్స్ వేయడం
* అభ్యర్థుల నామినేషన్స్ వేసిన పత్రాలలో కొన్ని పత్రాలు కనిపించే లేదంటూ తిరస్కరిస్తున్నారని ఆరోప్రాణాలు
స్థానిక ఎన్నికలో నేపథ్యంలో ఎప్పుడు చూడనని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి, సుప్రీం కోర్ట్ జోక్యంతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎన్నికల రోజు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఎన్నో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఎటువైపో చూడాలి.
