గుంటూరు టీడీపీ లో కార్యకర్త ఆవేదన | న్యాయం చేయాలంటూ వేడుకోలు | గుంటూరు టీడీపీ | Netivartha.com
ఏదైనా పొలిటికల్ పార్టీలో అన్యాయం జరిగితే తిట్టే నాయకులను మీరు చూసారు, కానీ నాకు అన్యాయం జరిగింది అంటున్న గుంటూరు తెదాపా నాయకుడు పోపూరి నరేంద్ర ఇది సామాన్య కార్యకర్తలకు జరిగే అన్యాయం, ఇలాంటివి పార్టీలో జరగకుండా చూడాలి అని పోరాడే నాయకుడ్ని చూసారా, అవును ఇది నిజం, గుంటూరు లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గుంటూరు నగరంలో ఒక డివిజన్ ను తీర్చిదిద్ది, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఘన విజయం సాధించడంలో తానూ చేసిన కృషిని పార్టీ పెద్దలు గుర్తించాలని, పార్టీ కష్టకాలం లో పార్టీ వెంట నడిచినవారికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే సామాన్య కార్యకర్తలకు ఏం నమ్మకం ఉంటుందని ఆయన ప్రశ్నించారు, పార్టీకి తన సర్వశక్తులు ఒడ్డానని తనకు న్యాయం చేయాలనీ విన్నవించుకున్నారు.

