రాష్ట్రంలో 659 జడ్పిటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలుగుదేశం పార్టీ కి 71, జనసేన కు 2, భారతీయ జనతా పార్టీ కి 3 స్థానాలు, కూటమి పార్టీ కి ప్రత్యర్థి గా నిలిచిన వైకాపా 1 స్థానంతో సరిపెట్టుకుంది.
జడ్పిటీసీ నామినేషన్ల ఉపసంహారకు మంగళవారం ఆఖరిరోజు కావడంతో నామినేషన్ల ఉపసంహరణలో జోరు కనిపించింది, వైకాపా అభ్యర్థులు, కూటమి రెబల్స్ నామినేషన్స్ వెనక్కి తీసుకున్నారు. తెదాపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జగన్ కు కంచుకోటయిన పులివెందులలో 7 జడ్పిటీసీ స్థానాలకు గాను తెలుగు దేశం పార్టీ 3 స్థానాలు ఏకగ్రీవం చేసుకుంది. సింహాద్రిపురం, చక్రాయపేట, తొండూరు మండలాలు తెలుగు దేశం పార్టీ ఏకగ్రీవం చేస్తుకున్న స్థానాల్లో ఉన్నాయి.
