స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన సంఘటనల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రజలే కాదు ఉద్యోగులు కూడా పోస్టల్ బ్యాలెట్ తో కూటమి ప్రభుత్వం వైపు మొగ్గుచూపారన్నారు. ఈ సారి పోస్టల్ బ్యాలెట్ లో కూటమి ప్రభుత్వానికి పెరిగిన ఓటింగ్ శాతమే దీనికి నిదర్శనమన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఈవీఎం లతో ఎన్నికలు నిర్వహిస్తే మానిప్యులేట్ చేశామన్నారు, బ్యాలెట్ పేపర్స్ తో స్థానిక ఎన్నికలు జరిగితే రిగ్గింగ్ చేసారు, దౌర్జన్యాలు చేసారు అని మాట్లాడుతున్నారు.
పట్టణాలు, పల్లెలు అంటూ ఎక్కడ చూసిన కూటమి ప్రభుత్వానికి ఘన విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలందరికి శిరస్సు వంచి వందనం చేస్తున్నామన్నారు, సుపరిపాలనకు దక్కిన గౌరవం ఈ విజయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు చేకూర్చిన ఈ విజయం జీవితంలో సంఘటన అని చంద్రబాబు అన్నారు.
