సమ్మర్ హాలిడేస్ మూవీ ప్రమోషన్ కు విచ్చేసిన అల్లు అరవింద్ సినిమాలో నటించిన పిల్లలతో చాలా సరదాగా మాట్లాడారు, పిల్లలు ఇంత చిన్న వయసులోనే ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అని వాళ్ళని ఆట పట్టించారు.
నా పిల్లలకు అమ్మమ్మ గారి ఇల్లు ఊర్లోనే ఉంది, కానీ నాకు మాత్రం మా అమ్మమ్మగారి ఇల్లు పాలకొల్లు లో ఉంది, అమ్మమ్మ ఇంటి కి వెళితే చెరువులోకి వెళ్లి ఈతకొట్టేవాడినని పిల్లలకు అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎంతో సరదా అని పాతజ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. అదే హైదరాబాదు లో అయితే స్విమ్మింగ్ పూల్ కి వెళ్లినందుకు అల్లు రామలింగయ్య చితక్కొట్టారని అన్నారు.
సమ్మర్ హాలిడేస్ మూవీ లో లాగా స్కూల్ ఏజ్ లో ఏదైనా క్రష్ ఎవరైనా ఉన్నారా అని యాంకర్ స్రవంతి అడగగా ఒక్కటి కాదండి అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతు సమాధానం దాటవేశారు.
