బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకి గత కొంతకాలంగా సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ బలపడటం, ఫెడరల్ రిసర్వ్ కోతలపై ఆశలు తగ్గడం వంటి కారణాలతో బంగారం వెండి ధరలు ఎక్కువగా వ్యత్యాసాలకు గురవుతుంది. సామాన్యుడు బంగారం కొనడం అనేది ఒక కల, ఎప్పుడు తగ్గుతుందా తన వారికోసం బంగారం కొని దాచిపెడదామా అని ఎదురు చూస్తుంటాడు సామాన్యుడు. వారికోసం బంగారం రేటు రెగ్యులర్ గా చూసుకోవడానికి వెబ్సైటు లింక్ క్రింద ఇస్తున్నాము.
బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:
* బంగారం ధర ఎంతో చూడాలి.
* GST ఎంత లెక్క వేస్తున్నారో చెక్ చేసుకోవాలి.
*తరుగు శాతం ఎంతో చూసుకోవాలి, ఆభరణాన్ని బట్టి తరుగు శాతం మారుతుంటుంది.
* మజూరి ఎంత తీసుకుంటున్నారో చూసుకోవాలి.
* హాల్ మార్క్ చెక్ చేసుకోవాలి.
* తరుగు, మజూరి తగ్గుతుందని హాల్ మార్క్ లేని బంగారు నగలు కొనుగోలు చేసేవారు, తయారు చేయించుకునేవారు బంగారు నగలను కంప్యూటర్ ద్వారా పరీక్షించి నగల క్వాలిటీ మరియు తూకం ఫోటోతో ఉన్న సర్టిఫికెట్ ఇస్తారు, ఇవి ఎక్కువగా బంగారం షాప్స్ ఉండే ప్రాంతాల్లోనే ఉంటాయి, కొన్న తరువాత మీరు కొన్న నగను తూకం, క్వాలిటీ ఇలా పరీక్షించుకోండి, దీనికోసం కేవలం రూ. 100 నుండి మాత్రమే ఛార్జ్ చేసారు.
*నగలు కొనే ముందు ఆన్లైన్ లో డిజైన్ సెలెక్ట్ చేసుకొని నాలుగు షాప్స్ లో తిరిగి ఎంత క్వాలిటీ బంగారు నగ కావాలో దాని ప్రకారం ఎస్టిమేట్ వేయించుకొని, ధర చెక్ చేసుకొని తరువాత కొనుక్కోండి.
గోల్డ్ రేట్ చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైటు ను సందర్శించండి.
ఈ ధరలు ప్రాంతాన్ని బట్టి కొంచం మారతాయి.
ఇవి మా తరుపున కొన్ని సలహాలు మాత్రమే, ఇవి పాటించే ముందు సరిచూసుకోండి. నచ్చితే తప్పకుండా నలుగురికి షేర్ చేసి వారికి సహాయం చేయండి.
