మురుసు తుఫాను ఆంధ్ర ప్రదేశ్ ని అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసిన సహాయక చర్యలు, మరమత్తులు జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు వేగవంతం అయ్యేలా చూస్తున్నారు.
మురుసు తుఫాన్ తాకిడికి సముద్రంలో తమిళనాడుకు చెందిన జాలర్లు 9 మంది గల్లంతు అయ్యారు, వారిలో 7 గురు చనిపోగా మిగితావారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని గల్లంతైన వారిని వెతికే కార్యక్రమం ముమ్మరం చేయాలని అన్నారు. చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వస్తలకు పంపే ఏర్పాట్లు చేయాలన్నారు.
