విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు నవంబర్ నెల 11వ తారీఖున గాజులు బహుకరించనున్నారు. ఈ గాజులను భక్తులు, సేవ బృందాలు, సేవకులు నుండి విరాళాలుగా సేకరించనున్నారు.
ప్రతి సంవత్సరం భగినీ హస్త భోజనం పర్వదినంను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని గాజులతో శోభాయమానంగా అలంకరిస్తారు. గాజులతో అమ్మవారి మూలవిరాట్ ను, ఉత్సవమూర్తిని అలంకరిస్తారు.
కనకదుర్గమ్మ ఉత్సవ అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. అమ్మవారికి అలంకరించిన గాజులను పొందడానికి పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు.
