అర్ణబ్ తుఫాన్ కంటే మురుసు తుఫాన్ ప్రభావం అంత ఎక్కువగా ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉన్నతాధికారులు, కలెక్టర్లు తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం అర్ధరాత్రి వరకు మురుసు తుఫాన్ ప్రభావం వల్ల వర్షాలు పడతాయి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మురుసు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వేల సంఖ్యలో కరెంటు స్తంభాల దెబ్బతినే అవకాశం ఉన్నందున వాటిని భారీ సంఖ్యలో మురుసు ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. మురుసు తుఫాన్ వల్ల ఎక్కడ కరెంటు స్తంబాలు దెబ్బతిన్న వాటిని బాగుచేయడానికి తమిళనాడు నుండి 1000 మంది వస్తున్నారు అని తెలిపారు.
