Neti Vartha
•
Oct 24, 2026
Showing 1 matches found in our catalog.
పరిషత్తు ఎన్నికల రాజకీయం చాలా ఆసక్తి గా ఉంది. నామినేషన్ల దశలోనే, ప్రచారం మొదలు కాక ముందే మంచి రసవత్తరంగా ఉన్నాయి. సొంత కుటుంబసభ్యులే ఒక స్థానం కోసం పోటీపడడం, 22 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం.మశాఖపురం గ్రామం, ఇచ్చాపురం మండలానికి చెందిన ఆసి జాస్మిని వయసు కేవలం 22 సంవత్సరాలు, డిగ్రీ పూర్తి చేసింది, తెదాపా తరుపున ZPTC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.జాస్మిని కుటుంబం రాజకీయ నేపధ్యం గల కుటుంబం, ఆమె తండ్రి మాధవ రెడ్డి సర్పంచ్ గా పనిచేసారు. ఇప్పుడు జాస్మిని గురించి విన్నవారు చిన్నవయసులోనే రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని కొనియాడుతున్నారు.