Uncategorized

రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(DRF) టీమ్ ఏర్పాటు: జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

జిల్లాలో వరదలు,భూకంపాలు,అగ్ని ప్రమాదాలు,భవనాలు కూలిపోవడం,ప్రాణాలను రక్షించడం వంటి విపత్తు నిర్వహణ పరిస్థితులలో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు జిల్లాలో 12 మందితో కూడిన విపత్తు ప్రతిస్పందన దళాన్ని(Disaster Response Force)టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది.వీరికి 10 రోజుల పాటు హైద్రాబాద్ లోని నాగోలులో ఉన్న DRF ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
జిల్లా పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం వర్షాకాలంలో వరదలు,ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి పరిష్కరించేందుకు సహాయం చేసేందుకు,గానూ ఇద్దరు RSI లతో పాటు పది మంది కానిస్టేబుల్స్ (2+10)తో DRF టీమ్ ఏర్పరిచి,హైద్రాబాద్ లోని DRF శిక్షణ కేంద్రం నందు తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ సుశిక్షితులైన DRF సిబ్బంది భారీ వర్షాలు,వరదలు,ఫైర్ అసిసిడెంట్స్, భవనాలు కూలిపోయినవుడు,ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయ పర్చుకుంటు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు..

జిల్లా DRF టీమ్ కి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చినందుకు GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్., గారికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *