రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి (నేటివార్త)//::
*టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని మరియు కార్యదర్శి అనిత రామచంద్రన్ నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేయాలి మరియు జిల్లాలో తరచు ఫుడ్ ఫాయిజాన్ సంఘటనలు జరుగుతున్న విషయం పైన పూర్తి విచారణ చేసి దీనికి పూర్తి బాధ్యత ఆర్ సి ఒ గారు వారిని సస్పెండ్ చేయలి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని – ఏబీవీపీ ఆధ్వర్యంలో కొత్త బస్సు స్టాండ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం
పేపర్ లీకేజీకి బాధ్యతను చేస్తూ అసమర్ధ టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు కార్యదర్శి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి గ్రూప్-1 పేపర్ ని రద్దు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం ఈ సందర్బంగా జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ వందలాదిమంది నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేడు ఆ నిరుద్యోగులపాలిటీ కెసిఆర్ ప్రభుత్వం శాపంగా మారి విద్యార్థులను నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైంది ఎన్నో పోరాటాల ఫలితంగా అరకొర నోటిఫికేషన్లు వచ్చిన ఆ నోటిఫికేషన్లను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ ఫెలై ప్రతి నోటిఫికేషన్ హైకోర్టు మెట్టెక్కి నేడు లీకేజీలతోటి నిరుద్యోగులను మరియు వారి ఆశలను అడియాశలను చేసింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిరుద్యోగుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే పిఆర్సి నివేదిక ప్రకారం 2లక్షల 91 వేల వేల ఉద్యోగాలను భర్తీ చేసి టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీకి బాధ్యతను చేస్తూ పేపర్ ని వెంటనే రద్దు చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు కార్యదర్శి నైతిక బాధ్యతలు వహించి రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
డిమాండ్స్ :-
1. TSPSC లో ప్రశ్న పత్రాల లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలి.
2.ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణం తెర వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను, అధికారులను అరెస్టు చేయాలి
3. TSPSC చైర్మన్,సెక్రటరీని తొలగించాలి.
4. TSPSC ని ప్రక్షాళన చేయాలి.
5. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలి.
6. ప్రశ్న పత్రాలు లీకేజీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
7.జిల్లాలో తరచు జరుగుతున్న ఫుడ్ ఫాయిజాన్ సంఘటనలపైన సమగ్ర విచారణ చేయాలి
- విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
- జిల్లాలో అనేక ఫుడ్ ఫాయిజాన్ సంఘటనలు జరిగిన ఇంత వరకు పూర్తి స్థాయిలో ఎవరిపైన చర్యలు తీసుకుంటాలేరు దీనికి ముఖ్య కారణం ఆర్ సి ఓ గారి నిర్లక్ష్యం వెంటనే వారిని సస్పెండ్ చేయాలి ఈ కార్యక్రమం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ sfd జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రాము దిలీప్ అరవింద్ మణికంఠ నిశ్వంత్ యోగి మధు తిరుపతి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు