Uncategorized

పశ్చిమ బెంగల్ ని వణికిస్తున్న వైరస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో శ్వాస సమస్యలతో చనిపోతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ కారణంగా 19 మంది చిన్నారులు చనిపోయారని, వారిలో ఆరుగురు ఎడినో వైరస్‌ బారిన పడి మృతిచెందారని అధికారులు తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మాస్కులు ధరించాలని సీఎం మమతా బెనర్జీ ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *