ఎండలు పెరుగుతున్న వేళ చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అయితే కూల్ డ్రింక్స్, ఇతర శీతలపానీయాల వైపు వెళ్లకుండా నాచురల్ గా వచ్చే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీరు తాగితే మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం. ప్రపంచంలో మరి ఏది దీనికి సాటిరాదు. దీనికి ప్రాసెసింగ్ ప్రక్రియతో పనిలేదు.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
